లింగమనేని శివరామ్ ప్రసాద్‌కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది
విశాఖపట్నం రుషి కొండపై సీఎం క్యాంపు కార్యాలయం, సీనియర్ అధికారుల కార్యాలయాల ఏర్పాటు కోసం ప్రభుత్వం అక్టోబర్ 11, 2023న ఇచ్చిన జీవో 2015ను వెంటనే రద్దు చేయాలని కోరారు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 48/ఏ ఉల్లంఘనలకు పాల్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యలను వెంటనే నిలువరించాలని పిల్లో కోరారు.
లింగమనేని శివరామ్ ప్రసాద్‌కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. రుషికొండ నిర్మాణాల అంశంపై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. లింగమనేని శివరామ ప్రసాద్ దాఖలు చేసిన పిల్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ముఖ్యమంత్రిని రుషికొండకు వెళ్లొద్దంటారా?. ఇందులో ప్రజా ప్రయోజనం ఏం ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. ఇది రాజకీయపరమైన ఫిర్యాదు అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టులో పిల్ దాఖలు చేసుకోవాలని సూచించింది. హైకోర్టులో రుషికొండ కేసు పెండింగ్‌లో ఉన్నందున అక్కడే పిల్ దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.